Saturday, 10 June 2023

కానీ నువ్వే తిరిగి చూడలేదు..!


ఒక రోజు ఆకాశంలో దేవతలు, ఇద్దరు అమర ప్రేమికులు మాటలు విని కంట తడి పెట్టుకుంటే ఆ కనీరు వర్షం లాగా భూమి మీద పడింది అంట.


అమ్మాయి ఇలా అడిగింది అంట అబ్బాయిని -

నువ్వు నాకు ఒక మాట ఇచ్చావ్
ప్రతి మాట వెనుక..
కలుస్తా అన్నావ్
దారిలో ప్రతి తలుపు వెనుక..
కానీ నువ్వు ఇంత మోసం చేసావ్
నువ్వే లేవు నా పాడే వెనుక…

అబ్బాయి ఇలా జవాబు ఇచ్చాడు అంట -

అవును నీకు మాట ఇచ్చా
ప్రతి మాట వెనుక..
కలుస్తా అన్నాను
ప్రతి తలుపు వెనుక..
కానీ నువ్వే తిరిగి చూడలేదు
ఇంకొక పాడే ఉంది నీ పాడే వెనుక…!

No comments:

Post a Comment